Advertisementt

ఆమె అదిరింది, అయినా మొదటిదే బాగుంది!

Tue 08th Mar 2016 03:58 PM
priyanak chopra,jai gangaajal  ఆమె అదిరింది, అయినా మొదటిదే బాగుంది!
ఆమె అదిరింది, అయినా మొదటిదే బాగుంది!
Advertisement
Ads by CJ

ప్రియాంక చోప్రా కొత్త చిత్రం జై గంగాజల్ గూర్చి గత కొన్నాళ్ళుగా బాలివుడ్ జనాలు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ప్రకాష్ ఝా నిర్మాణ-దర్శకత్వంలో రూపొందిన ఈ పూర్తి స్థాయి పోలీస్ యాక్షన్ మూవీ మొన్న శుక్రవారం ధియేటర్లలో దిగింది. అంతకుమునుపు ఇదే ప్రకాష్ ఝా అందించిన అజయ్ దేవగన్ గంగాజల్ సినిమా బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఉండే పొలిటికల్ రౌడీయిజంని కళ్ళకు కట్టేట్టుగా చూపింఛి సూపర్ హిట్టుగా నిలిచింది. పూర్తిగా అలాంటి కథాంశం, కథనంలోనే నడిచిన జై గంగాజల్ కేవలం హీరోయిజం పండించడంలో ఇక్కడ హీరోని కాదని హీరోయిన్ ద్వారా నీతిని బోధించడం జరిగింది. చిత్రంలోని మిగిలిన పాత్రలు ఎలా ఉన్నా ప్రకాష్ ఝా మాత్రం తాను నటుడిగా కూడా సూపర్ అని రుజువు చేసుకునే ప్రక్రియలో విజయం సాధించారు. ఇక ప్రియాంక చోప్రా నటనతో చింపి ఆరేసింది. ఎన్ని చెప్పినా కథ పాతదే అయినప్పుడు కొత్త ఫీల్ రాదు కదా. అందుకే ఒక్క ప్రియాంక చోప్రా తప్ప మిగిలిన అన్నింటిలో జై గంగాజల్ కన్నా గంగాజల్ గొప్పగా ఉందని విశ్లేషకులు, సామాన్య జనాలి వర్దిక్ట్ పాస్ చేసారు.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ