Advertisementt

నన్ను మన్నించండి: బాలకృష్ణ

Tue 08th Mar 2016 10:54 AM
balakrishna,savithri audio function  నన్ను మన్నించండి: బాలకృష్ణ
నన్ను మన్నించండి: బాలకృష్ణ
Advertisement
Ads by CJ

రాజకీయ నాయకుడు, తెదేపా ఎమ్మెల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మొన్న సావిత్రి ఆడియో వేడుకలో మహిళల పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. జరుగుతున్న నష్టాన్ని బేరీజు వేసుకున్న బాలయ్య బాబు ఒక్కసారిగా మహిళలపై అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా మన్నించమని కోరారు. 

మహిళలంటే నాకు మొదటి నుండీ అపారమైన గౌరవం. ఏ ఇంటి మహిళనైనా మా ఇంటి ఆడపడుచుగా చూడటం మా కుటుంబ సాంప్రదాయం. ఇతరులను గౌరవించడం, మహిళలను తోబుట్టువులుగా చూడడం నా తండ్రి నుండి నాకు వారసత్వంగా సంక్రమించిన గుణం. సినిమా వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావు. నా సినిమాలలో కథాపరంగా వచ్చే సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలకు అపార్థాలు చేసుకోవద్దు. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకున్నట్లైతే మన్నింపు కోరుతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల మహిళలకు, దేశ విదేశాలలో ఉన్న సోదరీమణులకు నా శుభాకాంక్షలు అంటూ మొహమాటం లేకుండా బాలయ్య బాబు క్షమాపణలు కోరారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ