Advertisementt

అనసూయను ఆడేసుకుంటున్నారుగా!

Mon 07th Mar 2016 10:58 AM
anasuya,rashmi gautham,kshanam,guntur talkies  అనసూయను ఆడేసుకుంటున్నారుగా!
అనసూయను ఆడేసుకుంటున్నారుగా!
Advertisement
Ads by CJ

 

ఒకే షోలో ఇద్దరు లేడీ యాంకర్స్ ఉండడం, అందునా అది సూపర్ హిట్టయిన జబర్దస్త్ విషయంలో జరగడం కొంత వివాదాస్పద అంశమే. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్... వీరిద్దరూ ఒకరి పట్ల ఇంకొకరు స్నేహ భావంతో బయట కనపడినా ఇద్దరి మధ్య ఇగో క్లాషేస్ ఉన్నాయని కామెడీగా నాగబాబు, రోజాలే చానా సార్లు చెప్పుకొచ్చారు. మరి అలాంటి ఇగోలతో బుల్లి తెర మీద నుండి, బడా స్క్రీన్ మీదకి ఇద్దరు భామలు ఒకేసారి గుర్తింపు కోసం ఎగబాకడం యాదృచ్చికం. సోగ్గాడే చిన్ని నాయనలో అనసూయ చిన్నపాత్ర లాగానే, రష్మి కూడా అంతకు మునుపు ప్రస్థానం, కరెంట్ లాంటి చిత్రాలలో చిన్న పాత్రలేసింది. అటు అనసూయకు క్షణం, ఇటు రష్మికి గుంటూరు టాకీస్ నిజానికి అసలైన బ్రేక్ త్రూలుగా చెప్పుకోవాలి. బుల్లి తెర మీద బుల్లి బుల్లి బట్టలేసి ఆంటీ అనసూయ, నాటీ రష్మిలు ఆధిపత్యం కోసం పోరాడారు. ఇక అదే డామినేషన్ వెండి తెర మీద ఎవరు ప్రదర్శించారు అంటే రష్మికే ఓట్లు పడుతున్నాయి. క్షణంలో అనసూయ పాత్ర చప్పగా ఉంటె, గుంటూరు టాకీస్లో రష్మి రోల్ మసాలా పాపడ్ లాగా కిక్కు ఎక్కించింది. అందుకే అవర్ వోట్ గోస్ టు యంగ్ రష్మి అంటున్నారు కుర్రకారు. వీటికి తోడు అనసూయ కూడా సోషల్ మీడియాలో ఓ తప్పు చేసి, తన అక్కసు వెళ్లగక్కే కొన్ని ట్వీట్లు వేయడంతో రష్మి ఫ్యాన్స్ ఆమెను ఆడేసుకుంటున్నారు. ఫైనలుగా విషయం ఏమిటంటే వీరి గోల, గొడవ... స్మాల్ స్క్రీన్ మీద నుండి బిగ్ స్క్రీన్ మీదకి ప్రమోట్ అయింది. వయసు మీద పడిన అనసూయ ఆంటీకి, పదునెక్కిన కత్తిలాంటి పోరి రష్మికి పోలికే అవసరం లేదు అంటున్నారు ఇంకొందరు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ