Advertisementt

అత్తారింటికి దారేది సీన్ రిపీట్ అవుతుందా?

Mon 07th Mar 2016 10:53 AM
sardaar gabbar singh,sgs leakage  అత్తారింటికి దారేది సీన్ రిపీట్ అవుతుందా?
అత్తారింటికి దారేది సీన్ రిపీట్ అవుతుందా?
Advertisement
Ads by CJ

తెలుగు చిత్ర పరిశ్రమలో లీకేజీల పరంపర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. లీకయి కూడా సూపర్ హిట్టయిన సినిమాలలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదికే అగ్రతాంబూలం దక్కుతుంది. సినిమాలో అద్భుతమైన కథ ఉన్నప్పటికీ, ఆ విడుదల సమయంలో ఎడిటింగ్ టేబుల్ మీద నుండి ఫస్ట్ హాఫ్ మొత్తం బయటకి పొక్కడం, అటు తరువాత మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చిత్రాన్ని రిలీజుకు ముందే చూసేయడం జరిగింది. నష్టాన్ని తగ్గించే ప్రక్రియను అటు తరువాత మొదలుపెట్టినా నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారి అమాయకపు ఫేసు, త్రివిక్రమ్ మీదున్న నమ్మకం, పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానం, ఇలా అన్నీ కలగలిసి అత్తారింటికి దారేది పట్ల సాఫ్ట్ కార్నర్ డెవెలప్ చేసి బాక్సాఫీసును బద్దలు కొట్టించాయి. మళ్ళీ అదే సీన్ సర్దార్ గబ్బర్ సింగ్ పట్ల కూడా రిపీట్ అవుతుందేమో అన్న అనుమానం ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలయింది. సోషల్ మీడియాలో సర్దార్ షూటింగ్ ఫోటో అంటూ ఓ పిక్చర్ బయలుదేరింది. పైన చూస్తున్న పిక్ షూటింగ్ దగ్గరది అయితే ఫ్యాన్స్ సంబర పడిపోయేవారు. కానీ అది ఎడిటింగ్ టేబుల్ మీద పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలప్పుడు తీసింది కావడమే కలవరపాటుకు గురిచేసే అంశం. ఎడిటింగ్ దగ్గర ఈ  ఫోటో తీసిన మహానుభావుడు అంతటితో ఆగాడా లేక సినిమా మొత్తాన్ని కాపీ-పేస్టు చేసేసాడా అన్నది తేలాలి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఇటువంటి దొంగతనాలు కోట్లు పెట్టుబడి పెడుతున్న నిర్మాతల పాలిట, బయ్యర్లను చావుదెబ్బ కొట్టేస్తాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ