Advertisementt

మంచు మనోజ్, అంతులేని పోరాటం!

Mon 07th Mar 2016 12:07 AM
manchu manoj,shourya  మంచు మనోజ్, అంతులేని పోరాటం!
మంచు మనోజ్, అంతులేని పోరాటం!
Advertisement
Ads by CJ

హిట్టు కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్న మంచు మనోజ్ మరో సినిమా వరకు వేచి ఉండవచ్చు. మొన్న శుక్రవారం విడుదలయిన శౌర్య చిత్రం ఈ వారం రిలీజయిన అన్ని చిత్రాల్లోకెల్లా నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ పక్కన పెడితే, హీరో పాత్ర కోసం మనోజ్ ఏకంగా ఎనిమిది కిలోల వరువు పెరిగినా జనాల అంగీకారం మాత్రం దక్కలేదు. ఓ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని చెప్పి అటు థ్రిల్ లేక, ఇటు లవ్ పండక దశరథ్ దర్శకత్వం ఆడియెన్సును అష్టకష్టాల పాల్జేసింది. పాయింట్ బాగున్నప్పటికినీ స్క్రీన్ ప్లేలో తప్పిదాలు దొర్లడం, ఇటువంటి కథను మరియు కథనాన్ని పకడ్బందీగా నడిపే చాకచక్యం దశరథ్ దగ్గర కొరవడడం, అన్నీ వెరసి మనోజ్ ఖాతాలో మరో భారీ ఫ్లాపును చేరవేసాయి. ట్రైలర్లో చూపినంత గొప్పగా సినిమా ఏ నిమిషంలోను అనిపించకపోవడంతో అందరికీ నిరాశే ఎదురయింది. ఇంతోటి సినిమా గురించి మళ్ళీ బాక్సాఫీస్ ముచ్చట్లు కూడా అనవసరమని అనుకోవద్దు ఎందుకంటే మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ