Advertisementt

బాక్సింగ్ సినిమా కోసం వెయిటింగ్!

Sun 06th Mar 2016 04:31 PM
nara rohit,thuntari  బాక్సింగ్ సినిమా కోసం వెయిటింగ్!
బాక్సింగ్ సినిమా కోసం వెయిటింగ్!
Advertisement
Ads by CJ

నారా రోహిత్ మెతడ్ యాక్టింగ్ చేసినా, మరే యాక్టింగ్ చేసినా బాక్సాఫీస్ దగ్గర విజయం కోసమైతే ఇంకా వెయిటింగ్ చేస్తున్నాడు. ఏకంగా అరడజన్ సినిమాలు సెట్స్ మీద ఉన్నా, ఒక్కొక్కటి మెల్లిగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా తమిళ దర్శకుడు, కథా రచయిత మురుగదాస్ అందించిన కథతో వస్తున్న తుంటరిపై మాత్రం అంచనాలు బాగానే నెలకొన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ కథకు తమిళంలో జనాలు మంచి మార్కులు వేసారు. అందుకే తెలుగులో కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రీమేక్ చేసి తుంటరిగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే చూపించిన ట్రైలర్లో విషయం ఉందని తెలిసిపోవడంతో, సినిమా పట్ల కాస్తంత సానుకూల దృక్పదంతో ఉన్నారు ప్రేక్షకులు. లైట్ వెయిట్ కామెడీ, చిన్న రొమాన్స్, ఇక అసలైన ఉత్కంట నిండిన బాక్సింగ్ ఎపిసోడ్స్ సినిమాలో ఆకర్షణలుగా చెబుతున్నారు. ఈవారం సినిమాల గోల ఎలాగో అయిపొయింది గనక, వచ్చే వారం క్యూలో నిల్చున్న మొదటి చిత్రం తుంటరి కోసం మనం వెయిట్ చేయొచ్చు! 

Tags:   NARA ROHIT, THUNTARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ