పెద్దగా పనులేమీ లేని ప్రభావమో.. లేదంటే బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో సహవాసం కారణంగానో తెలియదు కానీ... ఇటీవల ఇలియానా చిత్ర విచిత్రంగా ఆలోచిస్తోంది. అందులో రొమాంటిక్ కోణం కూడా కనిపిస్తోంది. కేవలం ఆలోచించడమే కాదండోయ్. వాటిని ధైర్యంగా బయట పెట్టి కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. 'ఇంట్లోకి వెళ్లగానే బ్రా తీసి ఓ మూలకి విసిరేస్తే అందులో కిక్కే వేరబ్బా... అది మగాళ్లకి ఎప్పటికీ అర్థం కాదని' ఆమధ్య ఓ ట్వీట్ వేసి చర్చను లేవనెత్తింది ఇలియానా. దాని గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకొన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఓ చిలిపి పనే చేసింది ఇలియానా.
మీలో ఇళ్లల్లో ఒంటరిగా గడిపేవాళ్లు ఎవరెవరు? అసలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే మంచి పని ఏది? అన్న ప్రశ్నని ట్విట్టర్‌లో వదిలింది. ఇలియానాలాంటి ఒక అందమైన అమ్మాయి నుంచి ఇలాంటి ప్రశ్న వస్తే కుర్రాళ్లు మాత్రం ఎందుకు ఆగుతారు చెప్పండి? వాళ్లు కూడా చిత్ర విచిత్రమైన ఆన్సర్‌లు ఇచ్చారు. కొద్దిమంది బాత్‌రూమ్‌కి వెళతాం అంటే, మరికొంత మంది ఇస్త్రీ చేసుకొంటాం అని చెప్పుకొచ్చారు. ఆ ఆన్సర్‌లన్నీ గమనించాక... చిట్టిచివరిగా ఇలియానా కూడా ఓ ఆన్సర్ ఇచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు, అర్ధరాత్రి పూట, టీవీ ఎదురుగా సోఫాలో కూర్చుని ఏదో ఒకటి తినడం నాకు ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఈ ఆన్సర్ లైట్‌గానే అనిపిస్తుంది కదూ! లైట్ ఆన్సర్‌లు ఇస్తే ఆమె ఇలియానా ఎందుకు అవుతుంది చెప్పండి? అండర్‌వేర్‌ని మాత్రమే ధరించి అలా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ గడపడం ఇలియానాకి ఇష్టమట. అంటే ఇలియానా ఇంట్లో ఒంటరిగా ఉందంటే ఒంటిపై అండర్‌వేర్ మాత్రమే ఉంటుందన్నమాట. ఆమె ట్వీట్‌ని చూసిన కుర్రాళ్లంతా ఎంతైనా ఇలియానా టేస్టే వేరబ్బా అని మాట్లాడుకొంటున్నారు.