ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ పలుసార్లు నోరు జారుతూ నవ్వులపాలవుతున్నాడు. ఆ మధ్య జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మీడియాతో బూతు మాట్లాడి.. దొరికిపోయినా బాలయ్య ఇటీవల చిరంజీవిపై కూడా లేనిపోని వ్యాఖ్యలు చేసి హాట్‌టాపిక్‌గా నిలిచాడు. ఇక తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన నారా రోహిత్ తాజా చిత్రం ‘సావిత్రి’ ఆడియో వేడుకలో మరోసారి నోరుజారాడు. ‘అమ్మాయిలు వెంటపడమని పిలిస్తే ఫ్యాన్స్ ఏం చేస్తారు..? వెళ్లి కడుపుచేసేయండి’ అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడే సరికి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ వీడియో హల్‌చల్ చేస్తుంది. అయితే ఇది విన్నవారంతా ఓ సీనియర్ కథానాయకుడిగా, బాధ్యతయుతమైన ఎమ్‌ఎల్‌ఏ పదవిలో వుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలయ్యకు తగదు అని అంటున్నారు. సో.. బాలయ్య ఇక నుంచైనా కాస్త ఆచితూచి మాట్లాడితే.. అందంగా వుంటుందని సలహాలు ఇస్తున్నారు ఆయన శ్రేయోభిలాషులు..!