Advertisementt

అఖిల్.. అంటే తప్పించుకుంటున్నారు!

Sat 05th Mar 2016 01:17 PM
akhil,akhil akkineni,akhil second movie,nagarjuna,trivikram,sukumar  అఖిల్.. అంటే తప్పించుకుంటున్నారు!
అఖిల్.. అంటే తప్పించుకుంటున్నారు!
Advertisement
Ads by CJ

చిన్నప్పుడు ‘సిసింద్రీ’గా అలరించిన అఖిల్ హీరోగా.. ‘అఖిల్’తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఏ సినీవారసుడు చవిచూడని అతిపెద్ద డిజాస్టర్‌ను అఖిల్ చూశాడు. అయితే ఇప్పుడిప్పుడే అఖిల్ పరాభవం నుంచి తేరుకుంటున్న ఈ అక్కినేని నవ మన్మథుడు ద్వితీయయత్నంలో వున్నాడు. అఖిల్‌ రెండో సినిమాను కంటెంట్ వున్న దర్శకుడితో చేయాలని నాగార్జున డిసైడ్ అయ్యాడు. అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడట. రొటిన్ సినిమాలా.. కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా కొత్తదనంతో కూడిన కథాంశంతో అఖిల్‌ను మరోసారి గ్రాండ్‌గా పరిచయం చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్, విక్రమ్‌కుమార్‌లతో నాగ్ చర్చలు జరిపాడని.. అయితే సదరు దర్శకులు మాత్రం తమకు వేరే కమిట్‌మెంట్స్ వున్నాయని చెప్పి సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. సో.. ఇక అఖిల్ రెండో సినిమాకు ఇప్పటి వరకు దర్శకుడు ఖరారు కాలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ