'బ్రూస్‌లీ' పరాజయం తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. అందుకే 'బ్రూస్‌లీ' తర్వాత నటించబోయే తదుపరి చిత్రం కోసం ఎన్నో కథలు విని చివరిగా ‘తను ఒరువన్’ రీమేక్‌ను ఎంచుకున్నాడు. మొదట్నుంచీ ఈ రీమేక్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు రామ్‌చరణ్. అయితే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్-2’ ఘోర పరాజయం కావడంతో చరణ్ క్యాలిక్‌లేషన్స్ మారాయి. దర్శకుడిని కూడా మారిస్తే ఎలా వుంటుందని కూడా ఆలోంచించాడట. ఆ సమయంలోనే అల్లు అరవింద్ జోక్యంతో చరణ్ ఆ ఆలోచనను విరమించుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ దగ్గర్నుంచీ.. మొదలుకొని ప్రతి చిన్న ఆర్టిస్ట్ ఎంపికలో కూడా చరణ్ జోక్యం చేసుకుంటున్నాడట. అన్నింట్లోనూ చరణ్‌దే ఫైనల్ డెసిషన్. అంతేకాదు సురేందర్ రెడ్డితో పాటు చరణ్ కూడా ప్రత్యేక రచయితలను పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను చేయించాడట. ఇటీవలే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుంది.