మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రం అంటే అందరూ ఎక్కువగా ఎదురుచూసేది ఆయన అద్భుతమైన స్టెప్స్ కోసం. ఈ విషయాన్ని ఇతర హీరోల అభిమానులు కూడా ఒప్పుకుంటారు. కానీ దాదాపు ఎనిమిది ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి మరలా 'కత్తి' రీమేక్‌తో తన 150వ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి 60ఏళ్ల వయసులో ఆయన ఎలాంటి డ్యాన్స్‌లు చేస్తాడు? అనే విషయం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. మునుపటిలా డ్యాన్స్‌ల్లో ఆయన తన మ్యాజిక్‌ను మరలా చూపిస్తాడా? లేక పెరిగిన వయసు దృష్ట్యా క్లిష్టతరమైన స్టెప్స్‌కు దూరంగా ఉంటాడా? అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. కానీ చిరు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఈ చిత్రంలోని స్టెప్స్‌తో ప్రేక్షకులను మరీ ముఖ్యంగా అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కాగా డ్యాన్స్‌లు, సినిమాల విషయంలో ఇంతగ్యాప్ తీసుకొని రాజకీయాలలోకి ఎంటర్ అయిన తర్వాత తన ఫిజిక్‌ను కూడా కాస్త కోల్పోయాడు. ఆయన ఫిట్‌నెస్‌పై కూడా పలువురికి అనుమానాలు ఉన్నాయన్నది వాస్తవం. దీంతో తన ఫిట్‌నెస్‌ను మరలా సాధించుకోవడం, మరలా తన మునుపటి వేగాన్ని, లయను అందిపుచ్చుకోవడంతో పాటు సరికొత్త తరహా స్టెప్స్‌తో అందరినీ రంజింపజేయడానికి జుంబా డ్యాన్స్‌ను కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ డాన్స్ వల్ల ఆయనకు రెండు ప్రయోజనలు చేకూరుతాయి. వెరైటీ డాన్స్‌లను అవలీలగా చేయడంతో పాటు ఈ డాన్స్ వల్ల బరువు తగ్గి, మంచి ఫిట్‌నెస్ వస్తుంది. ఎరోబిక్స్‌కి డాన్స్‌ను మిళితం చేసేదే ఈ జుంబా డ్యాన్స్. దాంతో ఆయన ఇప్పుడు జుంబా డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి మరలా మనం మునుపటి చిరుని చూస్తామనే ఆనందంలో మెగాభిమానులు ఉన్నారు. దీన్ని ఆయన తన అభిమానులకు గిఫ్ట్‌గా ఇవ్వనున్నాడు. ప్రస్తుతం తన చిన్న కుమార్తె వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న చిరు తన 150వ చిత్రాన్ని వినాయక్‌తో కలిసి ఏప్రిల్ నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సిద్దం అవుతున్నాడు.