Advertisementt

ప్రభాస్ సినిమాకు సుధీర్ బాబు విలన్!

Fri 04th Mar 2016 03:04 PM
sudheer babu,prabhs,varsham movie,bhagi,jaya prakash reddy  ప్రభాస్ సినిమాకు సుధీర్ బాబు విలన్!
ప్రభాస్ సినిమాకు సుధీర్ బాబు విలన్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ తెలుగు చిత్రం రీమేక్‌ అవుతోంది. ఆ సినిమా పేరు 'భాగి'. అదే ప్రభాస్‌ నటించిన 'వర్షం' చిత్రం. ఇందులో టైగర్‌ష్రాఫ్‌, శ్రద్దకపూర్‌లు నటిస్తున్నారు. ఇక గోపీచంద్‌ నటించిన విలన్‌ పాత్రను తెలుగు హీరో సుధీర్‌బాబు పోషిస్తున్నాడు. తెలుగులో 'వర్షం' చిత్రంతో గోపీచంద్‌కు ఎంతటి పేరు వచ్చిందో బాలీవుడ్‌లో సుధీర్‌బాబుకు అంతటి పేరు తెస్తుందనే నమ్మకంతో యూనిట్‌ ఉంది. కాగా గతంలో పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన నవరస నటుడు కోట శ్రీనివాసరావు ఈ చిత్రంలో మరో కీలకపాత్రను చేస్తున్నాడు. తెలుగులో జయప్రకాష్‌రెడ్డి పోషించిన పాత్రను కోట హిందీలో పోషించనున్నాడని సమాచారం. ఎలాంటి పాత్రల్లో అయినా అది తండ్రి, తాత, విలన్‌,కామెడీ విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా ఏరకమైన పాత్రలోనైనా జీవించే కోట నటన ఈ చిత్రానికి పెద్ద హైలెట్‌ అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ