Advertisementt

నారారోహిత్‌ ఆశలు ఫలించేనా..?

Fri 04th Mar 2016 02:55 PM
nara rohit,banam,savithri,asura,pawan sadhineni  నారారోహిత్‌ ఆశలు ఫలించేనా..?
నారారోహిత్‌ ఆశలు ఫలించేనా..?
Advertisement
Ads by CJ

తన 'బాణం' సినిమా నుండి నిన్నటి 'అసుర' వరకు వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్‌. కానీ ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు ఓ సూపర్‌హిట్టు కూడా లేదు. కానీ ఆయనకు అవకాశాలు మాత్రం తామరతంపరగా వస్తూనే ఉన్నాయి. నారా వారి అబ్బాయి కావడంతో ఈయనకు అవకాశాలైతే వస్తున్నాయి కానీ ఓపెనింగ్స్‌ కూడా సరిగా ఉండటం లేదు. కేవలం నారా కుటుంబానికి రాజకీయ ఇమేజ్‌ తప్ప సినిమా ఇమేజ్‌ బలంగా లేకపోవడమే దీనికి కారణం. దాంతో ఆయన్ను సరిగ్గా ప్రమోట్‌ చేసే సినీ దిగ్గజాలు లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. కానీ ఈ సారి ఎలాగైనా నందమూరి బాలకృష్ణ అండదండలతో, ఆయన ఆశీస్సులతో, నందమూరి ఫ్యామిలీలో బాలయ్యకు ఉన్న ఇమేజ్‌ అయినా తన చిత్రానికి పనికి వస్తుందేమో అనే గంపెడాశతో ఉన్నాడు. కాగా ఆయన తాజాగా నటించిన 'సావిత్రి' సినిమా ఆడియో రేపు అంటే మార్చి 4వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తుండగా, శ్రవణ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానుండటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ వస్తుందని, నందమూరి అభిమానులు కూడా నారా రోహిత్‌ను తమవాడుగా భావిస్తారనే ఆశతో ఆయన ఉన్నాడు. మరి నారా రోహిత్‌ కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ