బాలకృష్ణ 100వ చిత్రంపై ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం రైతు సమస్యలపై పోరాడే ఓ రైతు నాయకుడి పాత్రతో సాగుతుందని సమాచారం. కాగా ఈచిత్రంలో నారారోహిత్ అతిథి పాత్రలో, నందమూరి తారకరత్న నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని తాజా సమాచారం. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా వినాయక్ దర్శకత్వంలో 'కత్తి' చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా రైతు సమస్యలపైనే సాగుతుంది. ఇలా బాలయ్య 100వ చిత్రం, చిరంజీవి 150వ చిత్రం రెండూ రైతు నేపథ్యంలో సాగే చిత్రాలే కావడం కాకతాళీయమే అయినా అందరిలో ఆసక్తిని కలిగించే విషయమే అని చెప్పవచ్చు. ఇలా వీరిద్దరు ఒకేసారి రైతు సమస్యలపై పోరాడే నాయకులుగా మారితే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అంటున్నారు.