Advertisementt

మరో తమిళ సినిమా ఓకే చేసిన కాజల్‌!

Thu 03rd Mar 2016 08:54 AM
kajal agarwal,sardhar gabbar singh,valu movie,vijay chandar  మరో తమిళ సినిమా ఓకే చేసిన కాజల్‌!
మరో తమిళ సినిమా ఓకే చేసిన కాజల్‌!
Advertisement
Ads by CJ

30ఏళ్ల భామ కాజల్‌అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగులో పవన్‌కళ్యాణ్‌ సరసన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో, మహేష్‌బాబు సరసన 'బ్రహ్మూెత్సవం' చిత్రాలతో పాటు విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించనున్న ఓ కొత్త చిత్రానికి కూడా ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె బాలీవుడ్‌లో 'దో లఫ్జోన్‌కీ కహాని' చిత్రంలో చేస్తోంది. తమిళం విషయానికి వస్తే ఆమె యువస్టార్‌ జీవా సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె 'వాలు' చిత్ర దర్శకుడు విజయ్‌చందర్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె తమిళ మన్మథుదు శింబు సరసన జోడీగా నటించనుంది. మరి ఈ చిత్రంలో శింబు-కాజల్‌ల జోడీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ