కాకతాళీయమే అయినా కూడా రామ్‌చరణ్ 'తని ఒరువన్' రీమేక్, ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' చిత్రాలు రెండు దాదాపు అటు ఇటుగా ఒకేసారి పట్టాలెక్కాయి. ఈ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ రెండు షూటింగ్స్‌లో కూడా హీరోలు ఇంకా ఎంటర్ కాలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా నడుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈ రెండు చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. 'జనతాగ్యారేజ్' విషయానికి వస్తే... ఇందులో మోహన్‌లాల్ కనిపించే కీలకసన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ షూట్ చేస్తున్నాడు. ఈ షూటింగ్‌లోకి ఎన్టీఆర్ మార్చి 5న జాయిన్ అవుతాడు. ఇక రామ్‌చరణ్ 'తని ఒరువన్' విషయానికి వస్తే అరవింద్‌స్వామి, పోసాని కృష్ణమురళిలపై కీలకసన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు సురేందర్‌రెడ్డి ఓ షెడ్యూల్ కూడా ముగించాడు. మార్చి రెండో వారంలో ఈ చిత్రం షూటింగ్‌లో చరణ్ జాయిన్ అవుతాడు. ప్రస్తుతం ఆయన తన సోదరి వివాహ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. మొత్తానికి హీరోలు లేకపోయినా పని కానిచేస్తున్నారు ఈ ఇద్దరు దర్శకులు. దాదాపు ఒకేసారి షూటింగ్ ప్రారంబించుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలలో కూడా ఒకే సమయంలోనే ముస్తాబవుతాయని సమాచారం.