సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు చేసే నటుడు, లోకనాయకుడు కమల్‌హాసన్. కేవలం దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీలో కూడా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా ఆయన ఇప్పటివరకు ఏడు కన్నడ చిత్రాల్లో నటించాడు. 2005లో 'సతీలీలావతి'కి రీమేక్‌గా వచ్చిన 'రామ షామ భామ' అనే కన్నడ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత దాదాపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అంటే సుమారు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యాడు. కన్నడ సూపర్‌స్టార్స్ శివరాజ్‌కుమార్-సుదీప్‌లు కలసి నటిస్తున్న 'కాళి' అనే మల్టీస్టారర్ మూవీలో ఆయన అతిథి పాత్రను చేయనున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన జాయిన్ కానున్నాడు. ఎంతైనా కమల్ నటిస్తుంటే ఆ చిత్రానికి వచ్చే మైలేజే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సారి కమల్ ఈ మల్టీస్టారర్‌కు తన తోడ్పాటు ఏమేరకు ఇచ్చి కన్నడ ప్రేక్షకులను అలరిస్తాడో వేచిచూడాల్సివుంది...!