ఈమద్యకాలంలో మన సీనియర్ స్టార్స్ సరసన హీరోయిన్లుగా చేయడానికి కుర్రహీరోయిన్లు ఒప్పుకోవడం లేదు. దాంతో మన సీనియర్ స్టార్స్ త్రిష, అంజలి, నయనతార వంటి హీరోయిన్స్‌తో సర్దుకుపోతున్నారు. కానీ తాజాగా విక్టరీ వెంకటేష్ నటించే తదుపరి చిత్రానికి స్టార్‌హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో, మహేష్‌బాబు సరసన 'బ్రహ్మూెత్సవం' చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం వెంకటేష్ మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా నయనతార నటిస్తోంది. దీని తర్వాత వెంకీ 'నేను...శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మల్టీ డైమెక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయిన యూనిట్ ఆమెను సంప్రదించింది.ఈ చిత్రంలో చేయడానికి ఆమె భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దానికి నిర్మాతలు ఓకే చెప్పడంతో కాజల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.