డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకొన్న యంగ్ తరంగ్ రాజ్‌తరుణ్. కాగా ఇటీవల ఆయన నటించిన 'సీతమ్మ అందాలు రామయ్యసిత్రాలు' చిత్రం ఆయనకు కాస్త నిరుత్సాహానే మిగిల్చింది. అయినా లోబడ్జెట్ చిత్రం కావడంతో దానికి అందరూ సర్దుకుపోయారు. ప్రస్తుతం రాజ్‌తరుణ్ మంచు విష్ణుతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత గీతాఆర్ట్స్‌లో, దిల్‌రాజు బేనర్‌లో ఆయన చిత్రాలు చేయాల్సివుంది. తాజాగా రాజ్‌తరుణ్ మరో యంగ్ డైరెక్టర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. తన చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వ శాఖలో పనిచేసిన నాని అనే యువదర్శకుడు చెప్పిన కథ రాజ్‌తరుణ్‌ను మెప్పించింది. దాంతో ఆయన నాని డైరెక్షన్‌లో చేయడానికి ఓకే చెప్పాడు. మరి ఈ చిత్రం ఏ బేనర్‌లో ఎప్పుడు చేయనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక్క ఫ్లాప్ వచ్చినా తనకు ఏమీ ఇబ్బంది లేదని రాజ్‌తరుణ్ ప్రూవ్ చేసుకున్నాడు. మరలా అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.