Advertisementt

ఎన్టీఆర్ పాటకు ప్రభుదేవా డాన్సులు..!

Tue 01st Mar 2016 03:10 PM
ntr,prabhudeva,janatha garrage,koratala siva  ఎన్టీఆర్ పాటకు ప్రభుదేవా డాన్సులు..!
ఎన్టీఆర్ పాటకు ప్రభుదేవా డాన్సులు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఎలాంటి డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డాన్స్‌ను చూసి ఇండియాలోని అన్ని వుడ్‌లు, చివరకు జపాన్‌ ప్రేక్షకులు కూడా ఆయనకు దాసోహం అయ్యారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా థియేటర్‌లో చిందులు వేయించే స్థాయిలో ఆయన డాన్స్‌లు ఉంటాయి. అయితే 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో మాత్రం ఆయన కేవలం క్లాస్‌ స్టెప్స్‌కే పరిమితం అయ్యాడు. దాంతో ఆలోటును ప్రస్తుతం తాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'జనతాగ్యారేజ్‌'తో తీర్చడానికి రెడీ అవుతున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌లో ఎన్టీఆర్‌ మార్చి 5వ తేదీ నుండి జాయిన్‌ కానున్నాడు. కాగా ఈచిత్రంలో ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌తో ఆయన ఆడియన్స్‌ను ఉర్రూతలూగించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సాంగ్‌కు ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరున్న ప్రభుదేవా నృత్యరీతుల్ని సమకూరుస్తుండటం విశేషం. దీనికి ప్రభుదేవా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ సాంగ్‌ షూట్‌కు సంబంధించిన ఏర్పాట్లలో యూనిట్‌ నిమగ్నమై ఉంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కీలకపాత్ర పోషిస్తుండగా, మెయిన్‌ విలన్‌గా మరో మలయాళ స్టార్‌ ఉన్ని ముకుందన్‌ నటిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ