ఎప్పుడైతే తెలుగుతో పాటు తమిళంపై కూడా మహేష్ దృష్టి పెట్టాడో అప్పటినుండి తను పనిచేసే దర్శకుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రెండు భాషల్లోనూ గుర్తింపు ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలని ఆయన డిసైడ్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన పివిపి సంస్థ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న 'బ్రహ్మూెత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే నెలలో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. దీని తర్వాత ఆయన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన కెర్‌ర్‌లోనే అతి భారీ బడ్జెట్‌తో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఏప్రిల్‌లో ముహూర్తం జరుపుకోనుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ ఏ చిత్రం చేస్తాడు? ఎవరి దర్శకత్వంలో చేస్తాడు? నిర్మాత ఎవరు? అనే విషయాలపై క్లారిటీ వచ్చింది.మురుగదాస్ చిత్రం తర్వాత మహేష్ కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిలో మంచి పేరున్న సౌత్ ఇండియన్ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నాడు.ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయనున్నామని అప్పుడే రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు అశ్వనీదత్. 2011లో ఎన్టీఆర్ హీరోగా మెహర్‌రమేష్ దర్శకత్వంలో చేసిన 'శక్తి' డిజాస్టర్ తర్వాత చాలాకాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా వున్నాడు అశ్వనీదత్. మహేష్‌బాబు తర్వాత ఆయన చిరంజీవితో, రామ్‌చరణ్‌లతో వరుస చిత్రాలు చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్నాడని సమాచారం.