Advertisementt

'సర్దార్‌'పై రోజుకో వార్త!

Mon 29th Feb 2016 04:32 PM
sardaar gabbar singh,kajal agarwal,sardaar gabbar singh highlights,pawan kalyan,marriage  'సర్దార్‌'పై రోజుకో వార్త!
'సర్దార్‌'పై రోజుకో వార్త!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఒక్కో ప్రత్యేకత బయటకు లీక్‌ అవుతూ అందరిలో ఈ సినిమా పట్ల విపరీతమైన క్రేజ్‌ను పెంచుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో 'అంత్యాక్షరి' అదిరిపోతుందని, అలాగే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ హైలైట్‌ అవుతుందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక 100 గుర్రాలు, 1000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో తీసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోతుందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌-కాజల్‌ అగర్వాల్‌ల మధ్య వచ్చే పెళ్లి ఎపిసోడ్‌ కూడా చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. 'గబ్బర్‌సింగ్‌'లో కూడా పవన్‌ -శృతిహాసన్‌ల మధ్య వచ్చే పెళ్లి చూపుల ఎపిసోడ్‌ అందులో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే 'సర్దార్‌'లో కూడా ఆ టైప్‌లో సాగే ఎపిసోడ్‌ హైలైట్‌ అవుతుంది అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ