Advertisementt

తగ్గని లోకనాయకుడి జోరు!

Mon 29th Feb 2016 02:19 PM
kamal haasan,kamal haasan movies,viswaroopam,kamal haasan stamina,3 movies  తగ్గని లోకనాయకుడి జోరు!
తగ్గని లోకనాయకుడి జోరు!
Advertisement
Ads by CJ

లోకనాయకుడు కమల్‌హాసన్‌ కిందటి ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన ఈ ఏడాది ద్వితీయార్థంలో కూడా మూడు చిత్రాలతో దండయాత్ర చేయాలని భావిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం మలయాళ దర్శకుడు, తన మిత్రుడు టి.కె.రాజీవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కమల్‌కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురుగా నిజజీవిత కుమార్తె శృతిహాసన్‌ కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. గతంలో తనతో 'బ్రహ్మాచారి' చిత్రాన్ని తెరకెక్కించిన బి.కె.మౌళి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి 'పరంపదం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి తెరకెక్కనున్నాయి. ఈ రెండింటిని ఈ ఏడాది ద్వితీయార్దంలో విడుదల చేయాలని కమల్‌ భావిస్తున్నాడు. కాగా ఆయన నటించిన 'విశ్వరూపం2'ను కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్న కమల్‌ అందుకు సంబంధించి పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కంపెనీస్‌తో చర్చలు జరుపుతున్నాడు.