Advertisementt

దీపిక విషయం లో హీరోయిన్స్ హ్యాపీ!

Mon 29th Feb 2016 02:14 PM
deepika padukone,hollywood,bollywood heroines,deepika padukone bollywood actress  దీపిక విషయం లో హీరోయిన్స్ హ్యాపీ!
దీపిక విషయం లో హీరోయిన్స్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

వరుసగా మూడేళ్లలో పది సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించింది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికాపడుకొనే. దాంతో ఆమెను తలుచుకుంటేనే బాలీవుడ్‌ హీరోయిన్లకు నిద్ర కరువవుతోంది. కానీ త్వరలో బాలీవుడ్‌ హీరోయిన్లకు దీపికా ఒక సంతోష కరమైన వార్తను అందిస్తుంది. ఆమె ప్రస్తుతం తన కేరాఫ్‌ అడ్రస్‌ను హాలీవుడ్‌కు మార్చుకొనే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే విన్‌ డీజిల్‌తో 'ట్రిపుల్‌ ఎక్స్‌' సినిమా చేస్తోంది దీపికా. తాజాగా ఆమెకు మరో హాలీవుడ్‌స్టార్‌ బ్రాడ్‌పిట్‌తో నటించే అవకాశం లభించిందని సమాచారం. అదే కనుక నిజమైతే ఇక దీపికా హాలీవుడ్‌కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కన్నడ కస్తూరిని ఇక బాలీవుడ్‌ తెరపై చూడలేమా? అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. మొత్తానికి తనకు తెలిసిన అన్ని విద్యలను దీపికాపడుకొనే హాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యేందుకు ప్రయోగిస్తోందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ