సంచలనాలకు మారుపేరు గా పిలవబడే రామ్ గోపాల్ వర్మ కు ఈ రోజు(ఫిబ్రవరి 27) భారీ వెల్కమ్ దక్కడం నిజంగా లక్కి అని చెప్పుకోవాలి ! భారత దేశ చరిత్రలోనే ఈ తరహ వెల్కమ్ ఎవరికీ దక్కదేమో అని అప్పుడే కామెంట్ కూడా చేసాడు వర్మ. ఏకంగా వందల కార్ లతో ఆయనకు ఈ రోజు గన్నవరం విమానాశ్రయం లో ఆహ్వానం దక్కింది. వంగవీటి పై సినిమా చేయడానికి రెడీ అయిన వర్మ వంగవీటి అభిమానులు కుటుంబ సబ్యుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విజయవాడ లో రౌడి యిజాన్ని దగ్గరనుండి చూసా, వంగవీటి కి దేవినేని కి మద్య ఉన్న వార్ గురించి అందరికి తెలిసిందే. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలకోసం ఈ రోజు విజయవాడ వెళ్ళాడు వర్మ. నేను విజయవాడ రౌడి నే అంటూ ఈ రోజు విజయవాడ కు వస్తున్నాను అంటూ ఫ్లైట్ నంబర్ , హోటల్ రూం నంబర్ తో సహా ముందే తెలిపి జోరుగా ఈ రోజు విజయవాడ బయలు దేరాడు వర్మ ! నన్ను ఎవరు ఆపలేరు, నాకెలాంటి భయం లేదు అంటూ జోరుగా వెళ్ళిన వర్మ వంగవీటి సినిమాతో తెలుగు లో ఇక సినిమాలు చేయనని చెప్పడం విశేషం. ఏది ఏమైనా వర్మ గట్స్ కు మెచ్చుకోవలసిందే !!