Advertisementt

కొరటాలకు ఎన్టీఆర్‌ గిఫ్ట్..!

Sat 27th Feb 2016 05:20 PM
koratala siva,ntr,sreemanthudu,janatha garage  కొరటాలకు ఎన్టీఆర్‌ గిఫ్ట్..!
కొరటాలకు ఎన్టీఆర్‌ గిఫ్ట్..!
Advertisement
Ads by CJ

'మిర్చి, శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించి రెండు చిత్రాలతోనే టాప్‌డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిన దర్శకరచయిత కొరటాల శివ. తనకు 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించినందుకు పొంగిపోయిన మహేష్‌ 'శ్రీమంతుడు' సక్సెస్‌ తర్వాత 50లక్షల విలువ చేసే ఆడి ఎ6 కారును కొరటాలకు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే మైత్రి మూవీస్‌ పతాకంపై కొరటాల శివ ఎన్టీఆర్‌తో 'జనతాగ్యారేజ్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్న కొరటాలకు మరో ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. స్క్రిప్ట్‌ దశలోనే కొరటాల పనితనం చూసి ముగ్దుడైన ఎన్టీఆర్‌ ఏకంగా 20లక్షలు ఖరీదు చేసే వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడట. మరి ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధిస్తే మరి ఏ రేంజ్‌ గిఫ్ట్‌ను ఎన్టీఆర్‌ కొరటాలకు ఇస్తాడో అని అందరూ ఆసక్తిగా ఇదే విషయం గురించి ప్రస్తావించుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ