Advertisementt

సాయిపై మెగాభినుల ఆగ్రహం..!

Sat 27th Feb 2016 05:04 PM
sai dharam tej,gang leader movie,mega fans,supreme  సాయిపై మెగాభినుల ఆగ్రహం..!
సాయిపై మెగాభినుల ఆగ్రహం..!
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ మేనరిజమ్స్‌, ఇమిటేషన్‌, టైటిల్స్‌, పాటలు, సిగ్నేచర్‌ స్టిల్స్‌.. ఇలా అంతా తన మామయ్యల స్టైల్‌ను ఫాలో అవుతూ వారి ఇమేజ్‌ను ఎక్కువగా వాడేసుకుంటున్నాడు. రామ్‌చరణ్‌కు అనుకున్న 'సుప్రీమ్‌, గ్యాంగ్‌లీడర్‌' వంటి మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్స్‌ను పెట్టుకుంటున్నాడు. దీంతో మెగాహీరోల మధ్యే పోటీ వాతావరణం క్రియేట్‌ చేస్తున్నాడు. సాయి ఇప్పటికే మాస్‌ చిత్రాల వైపు అడుగులు వేస్తూ మెగాహీరోలనే టార్గెట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని స్ట్రాటర్జీలు పన్నుతూ వాటిని తమ కుటుంబ హీరోలపైనే ప్రయోగిస్తున్నాడు. సాయి చేస్తున్న పని సబబు కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. వరుణ్‌తేజ్‌కు వచ్చిన గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌ని తన వద్దకు రప్పించుకున్నాడు. అయితే ఈ విషయమై మెగాభిమానులు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో వారు 'గ్యాంగ్‌లీడర్‌' టైటిల్‌ను సాయి వాడటంపై మండిపడుతున్నారు. ఈ టైటిల్‌ను పెట్టుకుంటే రామ్‌చరణ్‌ మాత్రమే పెట్టుకోవాలని కానీ సాయి పెట్టుకోవడం ఏమిటి? అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ టైటిల్‌ విషయమై సాయి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అసుల ఈ టైటిల్‌ను తాము పరిశీలించలేదని చెబుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధును సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ