మేధావి దర్శకునిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ తన గత రెండు చిత్రాలైన '1' (నేనొక్కడినే), 'నాన్నకు ప్రేమతో' చిత్రాలకు విదేశీ బ్యాక్‌డ్రాప్‌ను వాడుకున్నాడు. కాగా త్వరలో ఆయన రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి ఆయన యూఎస్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నాడని సమాచారం. ఇందుకోసం ఆయన యూఎస్‌కి వెళ్లి అక్కడ లోకేషన్స్ చూసుకుంటూ అక్కడే స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతున్నాడట. కాగా ఇటీవల ఆయన చిరంజీవి, రామ్‌చరణ్, అల్లుఅరవింద్‌లకు ఒకేసారి స్టోరీలైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని, త్వరలో ట్రీట్‌మెంట్ వెర్షన్‌ను సైతం ఆయన వారికి వినిపించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో రామ్‌చరణ్‌కు సుకుమార్ క్లాస్ ఇమేజ్‌ను సంపాదించిపెట్టడం ఖాయమని అందరూ నమ్మకంగా ఉన్నారు. చూద్దాం... ఈ చిత్రం చరణ్ ఇమేజ్‌నే కాదు.. కమర్షియల్‌గా కూడా సక్సెస్ పదం లో నిలుపుతుందేమో..!