ఎన్టీఆర్.. ఈయన అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి అతి పిన్నవయసులోనే టాలీవుడ్‌లో సంచలనాలు నమోదుచేశాడు. అయితే తనకు వచ్చిన మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయన ఎక్కువగా అలాంటి చిత్రాలే చేస్తూ రావడంతో ఆయన కొన్ని వర్గాల ప్రేక్షకులకు దూరంగా అయ్యాడు. అయితే 'టెంపర్' చిత్రం నుండి ఎన్టీఆర్ వైఖరి మారింది. తన ఇమేజ్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి అలవాటు చేసుకున్నాడు. ఇందులో ఆయన నెగటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు, 'ఎ' క్లాస్ ఆడియన్స్‌కు, మరీ ముఖ్యంగా ఓవర్‌సీస్ ప్రేక్షకుల్లో ఓ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా ఎన్టీఆర్‌లో మార్పు మొదలైంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. మారిన మనిషిగా ఆయన కనిపిస్తున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'జనతాగ్యారేజ్' లోనూ ఎన్టీఆర్ పాత్ర, అభినయం, కథ అన్ని విభిన్నంగా ఉంటాయని సమాచారం. ఫ్యామిలీ సెంటిమెంట్‌ను మిస్ కాకుండా మాస్ అంశాలతోనే ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి ఇది తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. మార్చి 5వ తేదీ నుండి ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. మరి ఎన్టీఆర్‌లో వచ్చిన ఈ మార్పు ఎన్టీఆర్‌కు ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడుతుందో వేచిచూడాల్సివుంది..!