Advertisementt

రాజు గారు.. ఇకనైనా ఆపేయండి!

Fri 26th Feb 2016 04:13 PM
dil raju,vasu varma,sunil krishnashtami,josh  రాజు గారు.. ఇకనైనా ఆపేయండి!
రాజు గారు.. ఇకనైనా ఆపేయండి!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు నూతన దర్శకులతో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ.. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ ‘రాజు’ మెల్ల మెల్లగా ఆ పేరును చెడగొట్టుకున్నాడని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం, బృందావనం వంటి చిత్రాలతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ మధ్య నిర్మాతగా ఫామ్‌ను కొల్పోయాడు. స్టార్‌హీరోలతో, అప్‌కమింగ్ హీరోలతో వరుసగా చిత్రాలను నిర్మిస్తూ కన్‌ఫ్యూజ్ అవుతూ సరైన జడ్ట్‌మెంట్ లేక ఫ్లాప్‌ల పరంపర కొనసాగిస్తున్నాడని అంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు. అయితే తన బ్యానర్‌లో ‘జోష్’ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసిన వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘కృష్ణాష్టమి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిఆటకే యూనివర్శల్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం దిల్ రాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. అయితే ఈ చిత్ర దర్శకుడు వాసువర్మ గురించి దిల్‌రాజు మొదట్నుంచీ మీడియా ముందు పొగడటం అలవాటైపోయింది. జోష్ టైంలో తన బ్యానర్‌లో అన్ని సినిమాల సక్సెస్‌ల  వెనుక వాసువర్మ వున్నాడని, అద్భుతమైన టాలెంట్ వున్న దర్శకుడని, తనకు స్క్రీన్‌ప్లే అంటే ఏంటో వాసువర్మ నేర్పించాడని ప్రశంసల జల్లులు కురిపించేవారు. అయితే తీరా జోష్ ఫ్లాప్ అవ్వడంతో రాజు గారు గాలి తుస్సుమంది. అయితే మళ్ళీ అదే పొగడ్తలను ‘కృష్ణాష్టమి’ సమయంలో కూడా కంటిన్యూ చేశాడు. తీరా ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలవడంతో.. మరోసారి రాజుగారు తలపట్టుకున్నారు. అయితే ఇక నుంచైనా రాజుగారు వాసువర్మను పొగడటం మానేయండి అంటున్నాయి మీడియా వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ