Advertisementt

హ్యాట్రిక్స్‌పై కన్నేసిన టాలీవుడ్‌ హీరోలు..!

Wed 24th Feb 2016 09:53 PM
nagarjuna,nani,prabhas,hatrick hits,bahubali  హ్యాట్రిక్స్‌పై కన్నేసిన టాలీవుడ్‌ హీరోలు..!
హ్యాట్రిక్స్‌పై కన్నేసిన టాలీవుడ్‌ హీరోలు..!
Advertisement
Ads by CJ

నాని నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రం విమర్శకుల ప్రశంసలైతే పొందింది కానీ కమర్షియల్‌గా వర్కౌట్‌కాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌', 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రాలు వరుసగా రెండు హిట్స్‌ను నానికి అందించాయి. దీంతో తన తదుపరి చిత్రం కూడా సక్సెస్‌ అయితే నాని హ్యాట్రిక్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన నటించిన 'మనం, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే ఊపులో త్వరలో రానున్న 'ఊపిరి' చిత్రం కూడా సక్సెస్‌ అయితే నాగ్‌ కెరీర్‌లో మరో హ్యాట్రిక్‌ చేరినట్లే, ఇక ప్రభాస్‌ విషయానికి వస్తే 'మిర్చి, బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రాలతో ఆయన వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లు కొట్టాదు. ఇప్పుడు ఆయన చేస్తున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం కూడా సంచలనాలు సృష్టిస్తే ఇక ప్రభాస్‌ కెరీర్‌లో మరో హ్యాట్రిక్‌ సాధ్యమవ్వడం ఖాయమని అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ