Advertisementt

'రాయబారి' ఆగిపోవడం వెనుక చెర్రీ..!

Wed 24th Feb 2016 09:51 PM
ram chara tej,varun tej,rayabhari movie,krish  'రాయబారి' ఆగిపోవడం వెనుక చెర్రీ..!
'రాయబారి' ఆగిపోవడం వెనుక చెర్రీ..!
Advertisement
Ads by CJ

మెగా కాంపౌండ్‌ నుండి వచ్చిన హీరోలందరూ మాస్‌ చిత్రాలు చేస్తూ మాస్‌ హీరోలుగా పేరుతెచ్చుకుంటున్నారు. చివరకు సాయిధరమ్‌తేజ్‌ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. కానీ వరుణ్‌తేజ్‌ మాత్రం తన మొదటి సినిమా నుండి అన్నిరకాల పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయినా ఆయనకంటూ ఇప్పటికీ ఎలాంటి క్రేజ్‌ రాలేదు. దీంతో మరోసారి క్రిష్‌ దర్శకత్వంలో 'రాయబారి' చిత్రం చేయడం మంచిది కాదని, కాస్త మాస్‌ చిత్రాలపై దృష్టి పెట్టాలని మెగాక్యాంప్‌లోని వారితో పాటు రామ్‌చరణ్‌ కూడా తన సోదరుడికి సలహా ఇచ్చి 'రాయబారి'లో నటించడం వల్ల అంత ప్రయోజయం ఏమీ ఉండదని పట్టుబట్టి మరీ వరుణ్‌పై చెర్రీ ఒత్తిడి తెచ్చాడని, ఆయన సలహా మేరకే వరుణ్‌తేజ్‌ 'రాయబారి' చిత్రం నుండి పక్కకు తప్పుకున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అంటే రాబోయే కాలంలో వరుణ్‌తేజ్‌ కూడా మాస్‌ ఇమేజ్‌ కోసం ఆరాటపడి ఆ టైపు చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ