Advertisementt

నందమూరి హీరో షాకింగ్‌ లుక్‌..!

Wed 24th Feb 2016 06:34 PM
raja cheyyi vesthe,nandamuri taraka ratna,villain roles  నందమూరి హీరో షాకింగ్‌ లుక్‌..!
నందమూరి హీరో షాకింగ్‌ లుక్‌..!
Advertisement
Ads by CJ

తారకరత్న... ఒకేసారి తొమ్మిది సినిమాల ఓపెనింగ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నాడే హాట్‌టాపిక్‌గా మారాడు. కానీ అది కేవలం ఒకరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ తొమ్మిది సినిమాలలో ఎన్ని తెరకెక్కి రిలీజ్‌ అయ్యాయి అనే విషయం ఆయనకు కూడా తెలియదేమో...! తన ఖాతాలో ఒక్క హిట్‌ కూడా లేదు. దాంతో 'అమరావతి' చిత్రంలో విలన్‌గా నటించి, అందరినీ మెప్పించి నంది అవార్డును కూడా పొందాడు. మరోసారి ఆయన షాకింగ్‌ లుక్‌తో నందమూరి ఫ్యాన్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. నారా రోహిత్‌ హీరోగా వారాహి చలన చిత్రం పతాకంపై రూపొందుతున్న 'రాజా చేయి వేస్తే' చిత్రంలో ఆయన విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రదీప్‌ దర్శకుడు. ఆయన లుక్‌ను ఇటీవల చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ లుక్‌ను చూసి నందమూరి అభిమానులే కాదు... సాధారణ ప్రేక్షకులు కూడా షాక్‌కు గురవుతున్నారు. గడ్డం బాగా పెంచి రఫ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ సినిమా మొత్తం ఇదే లుక్‌తో కనిపించనున్నాడట. లుక్‌ అయితే అదిరింది. మరి సినిమాలో అతను నటనాపరంగా ఏ విధమైన వైవిధ్యాన్ని చూపించి, తన కెరీర్‌కు ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తాడో సినిమా విడుదల అయితే కానీ తెలియదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ