అఖిల్‌తో పోలిస్తే నాగచైతన్యకు ఉన్న డిమాండ్ తక్కువే. కానీ అఖిల్ తన మొదటి చిత్రంగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చేసిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్ కావడంతో అఖిల్‌ను ఏ యాంగిల్‌లో చూపిస్తే బాగుంటుంది.. అనే విషయంలో దర్శకులు డైలమాలో ఉన్నారు. కానీ నాగచైతన్య విషయానికి వచ్చే సరికి ఆయన దర్శకులను మాయ చేస్తున్నాడనే చెప్పవచ్చు. హిట్, ఫ్లాప్స్‌లతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు చైతూ. ఈ విషయంలో సైలెంట్ కిల్లర్‌గా మారిన చైతూ తమ్ముడిని రేసులో వెనక్కి నెడుతున్నాడు. అక్కినేని కాంపౌండ్‌లో అందరూ దర్శకులకు మెయిన్ చాయిస్‌గా చైతూ మారాడు. దర్శకులంతా ఆయనే కావాలంటున్నారు. శ్రీవాస్, హరీష్‌శంకర్‌లతో పాటు 'సోగ్గాడే చిన్నినాయనా' డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ సైతం ఆయన కోసం స్టోరీలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 'సాహసం శ్వాసగాసాగిపో, ప్రేమమ్' చిత్రాలు షూటింగ్‌లు చివరి దశలో ఉన్నాయి. మొత్తానికి దర్శకులను మెప్పించడంలో చైతూ ఏదో మాయ చేస్తున్నాడని అని అందరూ అంటున్నారు.