టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన స్వయంగా నటించి నిర్మించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 50కోట్లకు పైగా షేర్ వసూలు చేసి భారీ లాభాలు సాధించింది. ఇటీవల మీడియాతో నాగ్ మాట్లాడుతూ... ప్రేక్షకులకు థ్యాంక్స్. 50కోట్ల షేర్ సాధించింది. వసూలు చేసిన దాంట్లో సగం కంటే తక్కువ బడ్జెట్‌తో అంటే 20కోట్ల కంటే తక్కువతో ఈ సినిమా తీశాం. ఇలా మంచి లాభాలు వచ్చినప్పుడే నిజమైన సక్సెస్ అని అర్థం. 50కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా 50కోట్లు వసూలు చేస్తే ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు... అని వ్యాఖ్యానించాడు. నాగ్ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాను ఉద్దేశించినవై ఉన్నాయనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగ్ ఇలా మాట్లాడటం బాగోలేదని, ఇలాంటి కామెంట్స్ చేసి అనవసర వివాదాలను క్రియేట్ చేయొద్దని అంటున్నారు.