టాలీవుడ్ డైరెక్టర్స్ అందరిలో పూరీజగన్నాథ్‌ది ఓ డిఫరెంట్ స్టైల్. కాగా ఆయన 'టెంపర్' చిత్రం తర్వాత మరో స్టోరీని చెప్పి ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని భావించాడు. కానీ ఎందుకో ఆ స్టోరీ ఎన్టీఆర్‌కు నచ్చలేదని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక పూరీకి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు మధ్య ఉన్న రాపో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే 'పోకిరి, బిజినెస్‌మేన్' అనే రెండు బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మహేష్ మాత్రమే కాదు... పూరీ కూడా అనేక సార్లు మీడియా ముఖంగానే చెప్పివున్నాడు. కాగా ఎన్టీఆర్‌కు చెప్పి మెప్పించలేక పోయిన స్టోరీని కొద్ది పాటి మార్పులు చేర్పులతో పూరీ ఇటీవల మహేష్‌కు చెప్పి ఓకే చేయించుకున్నాడని సమాచారం. వాస్తవానికి తమ తమ కెరీర్స్‌లో పూరీ, మహేష్‌లు ఇద్దరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీస్ ఇద్దరికీ హిట్స్‌ను అందించాయి. కాగా ప్రస్తుతం పూరీ కెరీర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. సో... ఈ సారి ఇబ్బందుల్లో ఉన్న పూరీకి మరో చాన్స్ ఇచ్చి ఆయనకు మరో హిట్ ఇవ్వాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. కానీ ప్రస్తుతానికి మహేష్ డైరీ మొత్తం ఇప్పుడు ఎంతో టైట్‌గా, వరుస సినిమాలతో నిండివున్నాయి. మరి మహేష్ పూరీకి ఎప్పుడు అవకాశం ఇస్తాడో వేచిచూడాల్సివుంది.