Advertisementt

బండ్ల గణేష్ స్కెచ్ అర్ధం అయ్యిందా!

Wed 24th Feb 2016 09:29 AM
bandla ganesh,lawrence,ganga,muni,lawrence with bandla ganesh,venkatesh  బండ్ల గణేష్ స్కెచ్ అర్ధం అయ్యిందా!
బండ్ల గణేష్ స్కెచ్ అర్ధం అయ్యిందా!
Advertisement
Ads by CJ

బండ్లగణేష్‌ మరలా ఫామ్‌లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే మలయాళ చిత్రం 'టూ కంట్రీస్‌' రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకటేష్‌తో రీమేక్‌ చేయాలని బండ్ల ఆశిస్తున్నాడు. ఇక తాజాగా బండ్ల గణేష్‌ చూపు రాఘవలారెన్స్‌పై పడింది. 'ముని, కాంచన, గంగ' వంటి చిత్రాలతో తమిళ్‌తోపాటు తెలుగులో కూడా సూపర్‌హిట్స్‌ కొట్టిన కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ అండ్‌ యాక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్న లారెన్స్‌తో ఓ చిత్రం చేయడానికి బండ్ల... లారెన్స్‌ నుండి గ్రీన్‌సిగ్నల్‌ పొందాడు. వరుస హర్రర్‌ చిత్రాలతో ఇప్పటివరకు బెల్లకొండ సురేష్‌కు మంచి లాభాలను ఆర్జించి పెట్టిన లారెన్స్‌ను ఇప్పుడు బండ్లగణేష్‌ తన దారిలోకి తెచ్చుకున్నాడు. కాగా లారెన్స్‌ తన తదుపరి చిత్రాన్ని బండ్లగణేష్‌తో చేయాలని డిసైడ్‌ అయ్యాడట. ఈ విషయంలో కూడా బండ్లగణేష్‌ తన మాటలతో, ఖరీదైన గిఫ్ట్‌లతో, భారీ రెమ్యూనరేషన్‌తో లారెన్స్‌ను తన దారిలోకి తెచ్చుకున్నాడని సమాచారం. మొత్తానికి ఈ చిత్రం కూడా హర్రర్‌ కామెడీగా తెరకెక్కనుందని సమాచారం. ఈ విషయాన్ని గణేష్‌ అఫీషియల్‌గానే ట్విట్టర్‌లో తెలియజేశాడు. మరి ఈసారి బండ్లగణేష్‌ ఎలాంటి ఫలితాన్ని రుచిచూస్తాడో చూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ