భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నానీ అన్ని సినిమాలకు బిజినెస్ బెంచ్ మార్కుగా తీసుకుంటే ముప్పు తప్పదు. అందుకు తగ్గట్టుగానే 14 రీల్స్ సంస్థ వారు కృష్ణగాడి వీరప్రేమగాధను అన్నింటా అనుకున్న లిమిట్స్ లోపే కంప్లీట్ చేసారు. భలే భలే క్రేజ్ మీద ఓపెనింగ్స్ వీర లెవెల్లో వచ్చినా నానీ సినిమాకు ఉండే అసలు వ్యాల్యూ ఎంతో ఇదిగో మొదటి వారాంతం, రెండో వారం మొదట్లోనే తెలిసిపోయింది. భలే భలే పూర్తి అవుట్ పుట్ 30 కోట్ల దాకా వెళ్లి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గూర్చి చేస్తే, బయటికి చెప్పుకోలేదు గానీ నానీ కూడా విపరీతమైన షాకుకి లోనై ఉంటాడు. అందుకే కృష్ణగాడి వీరప్రేమగాధ, నిజంగా నానీ స్టామినాను రీ-చెక్ చేసుకునేందుకు ఉపయోగ పడిన చిత్రంగా మనం చెప్పుకోవాలి. ముప్పయి మాట అటుంచి ఇరవై కోట్ల మార్కును తాకినా ఈ మూవీకి ఘన విజయం కిందే లెక్కేయాలి. మొదటి వారంలోపే కృష్ణగాడి బయ్యర్లు సేఫ్ అయ్యారంటే అందుక్కారణం 14 రీల్స్ వారు ఓ మోస్తారు ధరలకే పంపిణీ హక్కులను అమ్మడం. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. నానీ అసలు రేంజు ఎంత, కొసరు రేంజు ఎంత. తదుపరి ప్రాజెక్టు కోసం ఇప్పటి నుండే లెక్కలు వేసుకోవడం నిర్మాతలకు తప్పదేమో!