ఒక్క వర్గం ప్రేక్షకులకు నచ్చితేనే నాన్నకు ప్రేమతో వెళ్లి 50 కోట్ల క్లబ్బులో కూర్చుంది. జూనియర్ ఎన్టీయార్ సత్తాను ఇక అన్ని వర్గాలకు నచ్చే విధంగా ఓ చక్కటి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాతో మన ముందుకు తీసుకొస్తే, రికార్డు అంటూ చెప్పుకోవడానికి ఏదీ మిగలదు అని అభిమానులు ధైర్యంగా చెప్పుకునే విధంగా కొరటాల శివ జనతా గ్యారేజీ ఉండబోతోంది అంటున్నాయి సినిమా వర్గాలు. కొరటాల శివ పట్టుకునంతగా పబ్లిక్ నాడిని ఈ మధ్య వచ్చిన ఏ కొత్త దర్శకుడు కూడా పట్టుకోలేదు అన్నది శ్రీమంతుడుతోనే స్పష్టం అయింది. మహేష్ బాబును అంత గొప్పటి పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో కన్న కలలు ఒక్కసారిగా నిజమయ్యాయి. అలాంటి కొరటాల ఈసారి కూడా అటు క్లాస్ నచ్చేలా, ఇటు మాస్ ఉర్రూతలూగేలా జనతా గ్యారేజీ తయారవనుంది. ఒకప్పుడు రాజమౌళి, అటు తరువాత కొరటాలకు మాత్రమే తారక్ నటనలోని అన్ని కోణాలను ఆవిష్కరించే ప్రతిభ ఉందని అందరు ఒప్పుకునే విధంగా చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ లాంటి ఉద్దండపిండాల మధ్య ఎన్టీయార్ నటన తారా స్థాయికి చేరనుంది అనడంలో సందేహం అవసరం లేదు.