Advertisementt

ఇదేం సెంటిమెంట్ విశాల్..!!

Tue 23rd Feb 2016 12:42 AM
vishal,marudhu movie,accident,sentiment,vishal sentiment  ఇదేం సెంటిమెంట్ విశాల్..!!
ఇదేం సెంటిమెంట్ విశాల్..!!
Advertisement
Ads by CJ

సాదారణంగా నేటితరం హీరోలు రిస్కీషాట్స్‌లో.. యాక్షన్‌ సన్నివేశాల్లో సొంతగా డూప్‌లేకుండా నటించడానికి సిద్దపడుతున్నారు. అందువల్లనే ఈ మద్యకాలంలో చాలామంది హీరోలు గాయాలపాలవుతున్నారు. అలాంటి వారిలో ఒకడు విశాల్‌. ఆయన వరుసగా ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సమయంలో గాయపడటం జరుగుతోంది. అయితే అలా తాను గాయపడిన చిత్రాలన్ని విడుదలైన తర్వాత మంచి విజయాన్ని సాధిస్తుండటంతో ఆయన గాయాలను పెద్దగా పట్టించుకోకపోవడమే కాదు... గాయాలను సైతం సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు తెలుపుకొచ్చాడు. తాజాగా ఆయన 'మరుదు' సినిమా షూటింగ్‌లో బాగా గాయపడ్డాడు. 'పూజై' టైమ్‌లో కూడా ఆయనకు దెబ్బలు తగిలి దాదాపు 22కుట్లు పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 'మరుదు' చిత్రం షూటింగ్‌ సమయంలో కూడా విశాల్‌ తీవ్రంగా గాయపడినప్పటికీ దానిని లెక్కపెట్టకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆయనకు ఈ చిత్రంలో జరిగిన గాయం కారణంగా కుడికాలికి, ఎడమ చేతి వేళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. అయితే గాయపడ్డ ప్రతిసారి హిట్‌ కొట్టడంతో ఆనందంగానే ఉందని, దానిని సెంటిమెంట్‌గా భావిస్తున్నానని ఆయన కోలీవుడ్‌ మీడియాకు చెప్పుకొని ఆనందపడుతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ