స్వర్గీయ ఉదయ్‌కిరణ్, నితిన్ వంటి ఎందరికో లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ. కాగా 'తొలివలపు' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న గోపీచంద్ వంటి నటుడిలోని టాలెంట్‌ను గుర్తించి, గోపీచంద్‌కు 'జయం, నిజం'వంటి చిత్రాల్లో విలన్ పాత్రలను ఇచ్చి మరలా గోపీని ఇండస్ట్రీలో నిలబెట్టిన ఘనత తేజది. అయితే ఈ దర్శకుడు చాలా కాలంగా వరుస ఫ్లాప్‌లలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో దర్శకుడు తేజ మరో హీరోకు విలన్‌గా వేషం ఇచ్చి అతడికి సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు...యాంగ్రీ యంగ్‌మేన్‌గా పేరుతెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఈయన కూడా అప్పుడెప్పుడో వచ్చిన 'గోరింటాకు, ఎవడైతే నాకేంటి' చిత్రాల తర్వాత హిట్ లేక తెరమరుగై పోతున్నాడు. ఇలాంటి తరుణం లో వీరిద్దరూ కలిసి వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'అహం' అనే చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతో ఓ కొత్త హీరో పరిచయం అవుతుండగా, విలన్ పాత్రలో రాజశేఖర్ నటించనున్నాడు. మొత్తానికి కెరీర్ మొదట్లో 'తలంబ్రాలు; ఆహుతి' వంటి చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి, ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని, అందులోనూ పవర్‌ఫుల్ పోలీస్‌గా తనదైన మార్క్ చూపించిన రాజశేఖర్‌కు ఈ 'అహం' చిత్రంతో తేజ ఎలాంటి సెకండ్ ఇన్నింగ్స్‌ను అందిస్తాడో వేచిచూడాల్సివుంది.