స్టార్‌హోటల్స్‌లో సమంత అది చేయదంట!

Sun 21st Feb 2016 11:40 PM
samantha,a aa movie,trivikram srinivas,samantha condition,star hotels  స్టార్‌హోటల్స్‌లో సమంత అది చేయదంట!
స్టార్‌హోటల్స్‌లో సమంత అది చేయదంట!

'అ...ఆ' సినిమా స్క్రిప్ట్‌లో భాగంగా సమంతపై ఓ బాత్రూం సీన్‌ ప్లాన్‌ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌. ఇలాంటి సీన్లను స్టార్‌హోటల్స్‌లో లేదా అందుకు అనుగుణంగా ఉండే రూమ్స్‌లోనో తెరకెక్కిస్తారు. అయితే సమంత మాత్రం ఇలాంటి చోట్ల అలాంటి సీన్స్‌ చేయనంటూ కండీషన్‌ పెట్టిందట. హొటల్స్‌, రూమ్స్‌ వద్ద ఇలాంటి సీన్లు చేయడం తనకు ఇన్‌సెక్యూర్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతో సమంత అలా అనేసిందని తెలుస్తోంది. దీంతో నిర్మాత రాధాకృష్ణ ఈ సీన్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలోనే ఈ సీన్‌ చేయాలని నిర్ణయించి ఇందుకోసం ప్రత్యేకంగా బాత్‌ టబ్‌ సెట్‌ వేశాడట. అసలే స్టార్‌హీరోయిన్‌. ఆమెతో అనవసరంగా గొడవ పడితే ఇప్పటికే ఆలస్యమైన ఈ చిత్రం షూటింగ్‌ మరింత ఆలస్యం అవుతుందనే ఉద్ధేశ్యంతో దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు నిర్మాత రాధాకృష్ణ కూడా ఈ విషయంలో సర్దుకుపోయారని సమాచారం.