Advertisementt

దిల్‌రాజుకు మతిపోవడం ఖాయం!

Sun 21st Feb 2016 08:12 PM
dil raju,krishnasthami,dil raju comment on review,kichidi,sunil  దిల్‌రాజుకు మతిపోవడం ఖాయం!
దిల్‌రాజుకు మతిపోవడం ఖాయం!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు ఇటీవల విడుదలైన 'కృష్ణాష్టమి' చిత్రం విషయంలో మీడియాపై, సినిమా రివ్యూలు, రేటింగ్స్‌పై ఒంటికాలితో లేచి తన సినిమాకు తనే రేటింగ్‌ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితిని చూస్తే రెండో వారం కూడా పడటం కూడా కష్టమే అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. ఈ చిత్రానికి అందరూ ఇచ్చిన రేటింగ్‌, రివ్యూలు చూస్తే మీడియాను ఆయన అనవసరంగా కెలికాడనే విషయం ఇప్పటికైనా ఆయనకు అర్థమైవుండాలి. ఈమధ్యకాలంలో వచ్చిన అతిపెద్ద కిచిడీ కథ ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రకరకాల సినిమాలు కనపడుతుంటాయి. 'సంతోషం' (అజయ్‌ ఫ్లాష్‌బ్యాక్‌), '1' (నేనొక్కడినే) (హీరోయిన్‌ను పడేసే ఎత్తుగడ), హీరోయిన్‌ చెప్పే బెలూన్‌ ఫిలాసఫీ ( 'బాద్‌షా'లో కాజల్‌ క్యారెక్టరైజేషన్‌), కీలకమైన మలుపు (బావగారూ బాగున్నారా..!), ఇంటర్వెల్‌ (మర్యాద రామన్న), సెకండాఫ్‌లో విలన్స్‌ని మార్చటం (రెడీ), ఇలా అడుగడుగునా ఎన్నో సినిమాలు పంటి కింద రాయిలా వస్తూ, జ్ఞాపకశక్తికి పరీక్షలా తగులుతుంటాయి. అలా జరగడం చూసి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి రివ్యూలు ఇచ్చిన రేటింగ్స్‌ కంటే ఇంకా తక్కువ రేటింగ్‌ను ఇస్తున్నారనే విషయం దిల్‌రాజుకు ఇప్పటికే అర్థం అయివుంటుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ