Advertisementt

చైతూ ఎదురుచూపులు ఫలిస్తాయా!

Sun 21st Feb 2016 08:04 PM
naga chaitanya,sahasam swasagaa saagipo,premam,harish shankar,naga chaitanya movies  చైతూ ఎదురుచూపులు ఫలిస్తాయా!
చైతూ ఎదురుచూపులు ఫలిస్తాయా!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంటే వారికి క్లాస్‌ సినిమాలు తెచ్చిన గుర్తింపును మాస్‌ సినిమాలు తేలేకపోయాయి. అదే విషయం అక్కినేని నాగేశ్వరరావు నుండి అక్కినేని నాగార్జున, నాగచైతన్య వరకు ప్రూవ్‌ అవుతూనే ఉన్నాయి. కాగా ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయినా కూడా స్టార్‌ హీరో అనే పదానికి ఆమడదూరంలో ఉండిపోయాడు నాగచైతన్య. మధ్యలో మాస్‌ హీరోగా ట్రై చేసినా కూడా అది వర్కౌట్‌ కాలేదు. ఇప్పటివరకు చైతూ ఎంతో కొంత ఇమేజ్‌ తెచ్చుకున్నాడంటే అవి కేవలం క్లాస్‌ సినిమాల ద్వారానే. కాగా చైతూ తన కెరీర్‌లో ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తనకు 'ఏమాయా చేశావే'తో తొలిహిట్టును అందించిన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం చేస్తున్నాడు. ఇక మలయాళంలో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని అదే టైటిల్‌తో రీమేక్‌ చేస్తూ అందరికీ ప్రేమను పంచడానికి రెడీ అవుతున్నాడు. విడుదలకు సిద్దమవుతున్న ఈ రెండు చిత్రాలు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్సే కావడం విశేషం. ఇలా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌తోనే భారీ హిట్‌ కొట్టాలనే కసితో చైతూ రగిలిపోతున్నాడు. మరి ఈ రెండు చిత్రాలలో ఒకటైనా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. ఇక తాజాగా మరో చిత్రానికి నాగచైతన్య గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి దర్శకుడు హరీష్‌శంకర్‌ బన్నీతో ఓ సినిమా చేయాలని భావిస్తూ వచ్చాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. దీంతో హరీష్‌శంకర్‌ ఇటీవల చైతూని కలిసి ఓ స్టోరీ వినిపించాడట. ఈ స్టోరీ చైతూకు బాగా నచ్చడంతో దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. 'ప్రేమమ్‌' తర్వాత చైతూ చేయబోయే చిత్రం ఇదే అని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ