వాస్తవానికి సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ అయిన రజనీకాంత్ ఇంతవరకు రెండు మూడేళ్లకు ఒక చిత్రం చేస్తూ వస్తున్నాడు. దానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు. కానీ ఈ వయసులో రజనీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ జోరు పెంచేశాడు. ప్రస్తుతం ఆయన 'కబాలి' చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దానికి తోడు ఆయన శంకర్ దర్శకత్వంలో 'రోబో2.0'ని కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఆయన శంకర్‌కు షరత్తు పెట్టాడట. అదే సమయంలో ఆయన మరో రెండు రీమేక్ చిత్రాలపై కూడా కన్నేశాడు. కన్నడలో సూపర్‌హిట్ అయిన 'శివలింగ' ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు రజనీకి 'చంద్రముఖి' వంటి ఎన్నో హిట్స్‌ను అందించిన పి.వాసు. ఇక రెండో చిత్రం మలయాళంలో మమ్ముట్టి హీరోగా సిద్దిఖ్ దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'భాస్కర్ ది రాస్కెల్' రీమేక్ మరోటి. ఈ చిత్ర దర్శకుడు సిద్దిఖ్ కూడా రజనీకి మంచి ఆప్తుడే . ఈ రెండు రీమేక్‌ల్లో ఏదో ఒకదాన్ని వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో రజనీ ఉన్నాడు.