Advertisementt

ఇలాగైతే కష్టమే సునీల్..!

Sun 21st Feb 2016 04:43 PM
sunil,krishnashtami,sunil movies,krishnashtami result  ఇలాగైతే కష్టమే సునీల్..!
ఇలాగైతే కష్టమే సునీల్..!
Advertisement
Ads by CJ

కమెడియన్ గా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని హీరోగా టర్నింగ్ ఇచ్చిన సునీల్ మొదటి సినిమా అందాల రాముడు లో పాపం అమాయకుడిగా బాగానే నటించాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన మర్యాద రామన్న సూపర్ హిట్ అయ్యింది. పూల రంగడు గా  ఓకే అనిపించుకున్నా ఆ తరువాత సునీల్ నటించిన సినిమాలు ఏవి పెద్దగ వర్కవుట్ కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని చేసిన కృష్ణాష్టమి సినిమా కూడా పెద్దగ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. సునీల్ సిక్స్ ప్యాక్ చేసిన డాన్స్ లు బాగా చేసిన కూడా పెద్దగ లాభం లేకపోయింది. సునీల్ సినిమాలో కామెడి బాగుంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు , కాని అది వదిలేసి యాక్షన్ వైపు వెళితే ఎలా ? కనీసం  పవర్ ఫుల్ గా చెప్పే డైలాగ్ కూడా మొహమాటానికి చెప్పినట్టు చెబితే ఎ ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటారు చెప్పండి. సునీల్ ఎన్ని సినిమాలు చేసిన కూడా అతనిలో ఇంకా నేను హీరోగా పనికి వస్తానా అనే భావన అతనిలో క్లియర్ గా కనిపిస్తుంది. హీరో అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ప్రేక్షకుడిని తనవైపు ఆకట్టుకోవాలి. కానీ సునీల్ మాత్రం ఈ విషయం లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. కామెడికి ఎక్కువ హీరోకి తక్కువ అనేలా ఉంది సునీల్ పరిస్తితి ? కాబట్టి ఇకనైనా నేనే హీరోని అని నమ్మి సినిమా చేస్తే తప్ప సునీల్ కి కష్టమే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ