భయంకరమైన యాక్షన్ సీన్లకు పేరొందిన సిల్వెస్టర్ స్టాలిన్ ర్యాంబో తెలుగులో ఏమైనా దిగబోతున్నాడా? కాదు కాదు, ఇతగాడు ప్యూర్ టాలివుడ్ ర్యాంబో మంచు మనోజ్. ప్రాణాంతకమైన పోరాటాలను డూపుల అవసరం లేకుండా మంచు మనోజ్ చేసేయడం మనం ఇంతకు మునుపు చుసేసాం. సహచర మిత్రులందరూ ఇలాంటి సాహసాలకు పాల్పడవద్దని వారించినా మనోజ్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డేర్ డెవిల్ స్టంట్స్ చేస్తూ జనాలను మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. శౌర్యతో వచ్చే నెల 4న మన ముందుకు రాబోతున్న మనోజ్ తదుపరి చిత్రానికి ర్యాంబో అన్న టైటిల్ రిజిస్టర్ చేయించారు. పుప్పాల రమేష్ నిర్మాతగా ఎప్పుడో సన్నాఫ్ పెదరాయడు పేరు మీద మొదలవాల్సిన ఓ మంచు మనోజ్ ప్రాజెక్టు ఆగిపోయినా, మళ్ళీ ఈ కాంబినేషన్ ర్యాంబోతో రానుంది. పేరు ఇంకా అఫీశియలుగా బయటకు రాని ఓ కొత్త దర్శకుడు ర్యాంబోని హ్యాండిల్ చేయనున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంకా ఫైనల్ కాలేదు. శౌర్య తరువాత మనోజ్ టేకప్ చేయబోతున్న సినిమా గనక మార్చి 4 తరువాతే మరింత సమాచారం లభించే ఆస్కారం ఉంది.