సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా 'కృష్ణాష్టమి'. రెండు గంటల యాభై నిమిషాల నిడివి గల ఈ సినిమాను కుదించి రెండు గంటల పదిహేను నిమిషాలకు చేశారు. ఫిబ్రవరి 19 న విడుదలయిన ఈ సినిమా గురించి ముందుగానే దిల్ రాజు 3.25 రేటింగ్ కూడా ఇచ్చేసాడు. మరి ఈ సినిమా ఆ స్థాయిలో ఉందనుకొని థియేటర్ కు వెళ్తే పొరపాటే. సునీల్ లాంటి హీరోను తీసుకొని అతని బడ్జెట్ కు మించి ఖర్చు పెట్టడంలో నిర్మాతగా తప్పు చేసాడేమో.. అని సినిమా చూస్తే అర్ధమవుతుంది.
క్రిటిక్స్ అందరూ మేధావుల్లా ఫీల్ అయ్యి సినిమా రేటింగ్స్ ఇచ్చేస్తున్తారని దిల్ రాజు కామెంట్ చేశారు. నిజంగానే 'కృష్ణాష్టమి' లాంటి రొటీన్ సినిమాకు కూడా 3.25 రేటింగ్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలానే వచ్చాయి. మళ్ళీ అదే తరహా కథ తీసుకొని సినిమాలు చేస్తే చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా రుచించదు. సినిమా రిలీజ్ కు ముందు అన్ని మాటలు చెప్పిన దిల్ రాజు ఇప్పుడేమంటారో చూడాలి..!