ఇటీవల తమిళస్టార్ హీరో అజిత్‌కు కాలుకు సర్జరీ జరిగింది. దాంతో ఆయన కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్చాడు. దాంతో ఆయన కోసం స్టోరీలు తయారుచేసుకొన్న దర్శకులు మన రాజాగారి నుండి గ్రీన్‌సిగ్నల్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాలకు నిర్మాతలు సైతం రెడీగా ఉన్నారు. ఇప్పటికే అజిత్‌తో 'బిల్లా, ఆరంభం' వంటి చిత్రాలను చేసిన స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఆయనతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం కోసం ఓ స్టోరీని తయారుచేసుకుంటున్నాడు. చోళరాజుల నేపథ్యంలో సాగే ఓ స్టోరీని ఆయన అజిత్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక అజిత్‌తో ఇప్పటికే రెండు సూపర్‌హిట్టులను అందించిన దర్శకుడు శివ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇక అజిత్‌ను దృష్టిలో ఉంచుకొని బాలమురుగన్ ఓ పవర్‌ఫుల్ స్టోరీని సిద్దం చేశాడు. ఇలా అజిత్ ఎప్పుడు సినిమాలకు మరలా గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడా? అని వీరందరూ ఆయన కోసం కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తున్నారు.