ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మాస్‌మహారాజా రవితేజ 'బెంగాల్‌టైగర్' విడుదలై ఇంతకాలం కావస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకీ కథల కోరత వల్ల ఆయన స్లో ఆయ్యాడా? లేక సినిమా సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడా? ఆయన దగ్గరకు వచ్చే దర్శకుల కథలు ఆయనకు నచ్చడం లేదా? ఆయనకు అవకాశాలు రావడం లేదా? ఏమిటి ఆయన సమస్య? అని ఇందస్ట్రీలోనే కాదు... ఆయన అభిమానులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు రవితేజతో తీయాలని భావించిన రవితేజ 'ఎవడో ఒకడు' చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి పైకి మాత్రం స్టోరీపర్‌ఫెక్ట్‌గా లేదని అందుకే ఈ చిత్రంలో రవితేజ నటించడానికి తిరస్కరించాడని కొందరు అంటుంటే.. అదేం కాదు... ఆయన రెమ్యూనరేషన్ విషయంలోనే దిల్‌రాజుతో విభేదాలు వచ్చాయనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇక నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రంజిత్‌మూవీస్ బేనర్‌లో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిపై కూడా రవితేజ ఎక్కడా స్పందించం లేదు. మరోపక్క ఆయనతో దర్శకుడు హరీష్‌శంకర్ బాలీవుడ్ మూవీ 'స్పెషల్26' చిత్రం రీమేక్ చేయనున్నాడనే వార్తలు జోరుగా వినిపించినా దానిపై కూడా ఎవ్వరికీ క్లారిటీ ఇవ్వడం లేదు మాస్‌మహారాజా.....!మరి ఈ గందరగోళానికి త్వరలోనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే మరిన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, వీటిపై రవితేజ అఫీషియల్‌గా స్పందిస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.